సీఎం కేసీఆర్ ఉన్న గడ్డమీద పుట్టడం నా అదృష్టం అన్నారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.. సీఏఏకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఏఏ వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో అక్బరుద్దీన్ పాల్గొని మాట్లాడారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింనందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్నతలు తెలిపారు.
సీఏఏ కేవలం ముస్లింలకే కాదు దేశంలోని పేదలందరికీ వ్యతిరేకం అన్నారు. సీఏఏపై ఇంత ఖరాకండిగా తీర్మానం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. ఎన్‌ఆర్‌సీ కొత్త సమస్యను సృష్టిస్తోంది. పౌరుడి కాని వారికి పౌరసత్వం వస్తుంది. దేశ పౌరుడికి పౌరసత్వం పోతుంది. ఈ చట్టం దేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంది. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. సీఏఏ, ఎన్పీఆర్ లు పేదలకు వ్యతిరేకం అన్నారు.