DMK:రైతులకు స్టాలిన్ భరోసా

8
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని ప్రారంభించిన ఎంకే స్టాలిన్ పలు కీలక హామీలు ప్రకటించారు. తిరుచిరాపల్లి సభలో మాట్లాడుతూ, డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే 20 లక్షల మంది రైతులకు పంప్‌సెట్లు అందిస్తామని స్టాలిన్ తెలిపారు. అదేవిధంగా, వరి కొనుగోలు ధరను క్వింటాల్‌కు ₹3,500గా నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు.

మహిళలు తమకు ఇష్టమైన గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు ₹8,000 విలువైన కూపన్ అందిస్తామని సీఎం ప్రకటించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇది కీలక చర్యగా ఆయన పేర్కొన్నారు.

తిరుచిరాపల్లి నగరాన్ని రాజధాని చెన్నై స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని స్టాలిన్ తెలిపారు. డీఎంకే ప్రభుత్వం తిరిగి వస్తే, భారీ ప్రాజెక్టులు — లైబ్రరీ, TIDEL పార్క్, ఒలింపిక్ అకాడమీని తిరుచిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తాను చెప్పింది చేస్తామని, చేసినదే చెబుతామని స్టాలిన్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కరుణానిధి తన తండ్రి అని గుర్తుచేసుకుంటూ… AIADMK పై విమర్శలు గుప్పించారు. అలాగే, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.

తమిళనాడులో కుల హింసలు లేవని, మత ఘర్షణలు జరగడం లేదని స్టాలిన్ అన్నారు. ఉత్తరప్రదేశ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ, తమ పాలనలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.ఉన్నత విద్య కోసం 9 లక్షల మంది విద్యార్థులకు ప్రతి నెల ₹1,000 అందిస్తున్నామని తెలిపారు.

Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!

గత ఐదేళ్లలో తిరుచిరాపల్లి ప్రాంతంలోనే ₹26,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. మహిళల ఉచిత బస్ ప్రయాణం, పోషకాహార అల్పాహార పథకం, “నాన్ ముదల్వన్” వంటి పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.

- Advertisement -