‘మిస్టర్ ప్రెగ్నెంట్’..రిలీజ్ డేట్ ఫిక్స్

59
- Advertisement -

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా నైజాం హక్కులను మంచి రేట్ కు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. ఇలాంటి ఫేమస్ సంస్థ ద్వారా తమ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుండటం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీమ్ లో సంతోషాన్ని కలిగిస్తోంది.

మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఇటీవల కింగ్ నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేసిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటి ప్రతి కంటెంట్ కూడా వారి ఆసక్తికి తగినట్లే ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్ రిలీజ్ తో అన్ని సెంటర్స్ ఆడియెన్స్ కు రీచ్ కాబోతోంది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా.

Also Read:మెగాస్టార్ దాన్ని నిలబెట్టుకుంటాడా?

సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – నిజార్ షఫీ, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, బ్యానర్ – మైక్ మూవీస్, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాతలు – అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి. రచన-దర్శకత్వం – శ్రీనివాస్ వింజనంపాటి.

Also Read:పిక్ టాక్ : ప్రియా గ్లామరసం.. అదరహో

- Advertisement -