మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన మిస్సోరీ రాష్ర్ట ప్రతినిధుల బృందం

180
Missouri State delegation meets Hon’ble Minister Sri KT Rama Rao
- Advertisement -

మిస్సోరీ రాష్ర్ట ప్రతినిధుల బృందం తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈ బృదం ఈ రోజు హైదరాబాద్‌లలో మంత్రి కెటి రామారావుతో సమావేశం అయినది. ఈ మూడు రోజుల పర్యటనలో తాము తెలంగాణలోని, విద్యా, వ్యాపార రంగాల్లో  ఉన్న అవకాశాలను పరిశీలన చేయనున్నట్లు మంత్రికి తెలిపారు. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సీటీ, టిహబ్, జినొమ్ వ్యాలీ, ఇక్రిసాట్ వంటి సంస్ధలను ఈ  మూడు రోజుల పర్యటనలో సందర్శిస్తారు.

ఉస్మానియా యూనివర్సీటీతో డ్యూయల్ డీగ్రీ కార్యక్రమం ఎర్పాటు చేసుకునే అవకాశాలను మిస్సోరి బృందం పరిశీలించనున్నది. చివరి రోజు తెలంగాణలోని కంపెనీల సియివోలతో ప్రతినిధుల బృందం సమావేశం కానున్నది.  మిస్సోరి అభివృద్దిలో కీలకమైన మిస్సోరీ పార్టనర్ షిప్ సంస్ధ ప్రతినిధులు,సెయింట్ లూయిస్ రీజినల్ చాంబర్, మిస్సోరి ప్రభుత్వాధికారులు ఈ బృందంలో ఉన్నారు. మంత్రితో జరిగిన సమావేశంలో హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హెడ్డా ఉన్నారు.
Missouri State delegation meets Hon’ble Minister Sri KT Rama Rao
పరిశోధనలకు ఉతం ఇచ్చేందుకు మిస్సోరి బృందం ఈరోజు టి హబ్, సెయింట్ లూయిస్ పట్టణంలో ఉన్న టి రెక్స్ ఇంక్యూబేటర్ కలిసి పనిచేసేందుకు ఒక యంవోయును కుదుర్చుకున్నారు. టిరెక్స్, టిహబ్ లు కలిసి టి బ్రిడ్జ్ కార్యక్రమం ద్వారా పనిచేస్తాయి. తెలంగాణలో టెక్నాలజీ, అవిష్కరణల రంగాల్లో అనేక అవకాశాలున్నాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. సిలికాన్ వ్యాలీలో తాము ఎర్పాటు చేసిన టిబ్రిడ్జ్  భాగస్వామిగా టి రెక్స్ పనిచేయడం ద్వారా అక్కడ ఉన్న టెక్నాలజీ, ఇక్కడ టి హబ్ లో ఉన్న అవిష్కరణలకు మద్య ఒక వారధిలాగా ఈ యంవోయు పనిచేస్తుందన్నారు.

మిస్సోరి రాష్ర్టంలో పర్యటించాలని మంత్రి కెటి రామారావుకి ప్రతినిధుల బృందం  అహ్వనించింది. మిస్సోరిలో ఉన్న అత్యుత్తమ విద్యా సంస్ధలు, వ్యాపారావకాశాలను మంత్రికి వివరించారు. తెలంగాణలోని కంపెనీలతో మిస్సోరీ రాష్ర్టంలోని కంపెనీలతో వ్యాపార, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తామని ప్రతినిధుల బృదం తెలిపింది.

- Advertisement -