ఇల్లు లేని పేదలకు పక్క గృహాలు నిర్మించాలనే ముఖ్యమంత్రి ఆశయం మేరకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. నగరంలో ని మంత్రి ఛాంబర్ లో జిల్లా గృహనిర్మాణ పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లా ఇంచార్జి కలెక్టర్ హరీష్ ,వివిధ శాఖ ల అధికారులతో కలిసి సమావేశం జరిగింది.జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 6777 డబల్ బెడ్ రూమ్ లు మంజూరు కాగా 2972 ఇళ్లకు టెండర్ ప్రక్రియ ముగియగా 2407 పనులు ప్రారంభం అయ్యాయని మంత్రి తెలిపారు. మిగతా వాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని,నివాస యోగ్యమైన స్థలాలను ఎంపిక చేయాలని అధికారుల కు ఆదేశించారు. టెండర్లు నిర్వహించేటప్పుడు స్థానిక ఎంఎల్ఏ ల కు సమాచారం ఇచ్చి వారి చేత కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేలా చూడాలన్నారు.మంజూరు అయిన డబల్ బెడ్ రూమ్ లకు మరో 84 కోట్ల నిధులు మౌళిఖ సదుపాయాల కల్పనకు అవసరం అవుతాయని ,వాటి మంజూరు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు.
నియోజకవర్గ ల వారిగా జరుగుతున్న పనులపై మంత్రి అరా తీశారు..ఇల్లు లేని పేదలకు గూడు కల్పించాలనే మంచి ఉద్దేశ్యంతో నిర్మిస్తున్న ఈ గృహాలు అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు ఉపయోగ పడేలా ఉండేలా చూడాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.ఇసుక కొరత ఏర్పడకుండా అబ్దుల్లాపూర్ మెట్ లోని స్టాక్ యార్డు నుండి తీసుకునేలా చూడాలన్నారు..అవసరం మేరకు కందుకూరు లో 4 ఎకరాల భూదాన్ భూమిని కేటాయించాలని కలెక్టర్ కు ఆదేశించారు. కొన్ని నియోజకవర్గ లలో ఉన్న భూసమస్యలను పరిష్కరించి ,త్వరిత గతిన పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని సూచించారు.
టెండర్లకు స్పందన రాక పోతే ఒకే చోట ,మండల కేంద్రాల్లో జి ప్లస్ 3 నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.దాంతో పాటు గతం లో నిర్మించిన జెఎన్ఎన్ యూఆర్ఎం,వాంబే,ఆర్ జి కె లలో చాలా చోట్ల లబ్ధిదారులు ఉండటం లేదని, ఆయా ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.నీటి సౌకర్యం, డ్రైనేజి,తదితర సదుపాయాలు కల్పించాలని అన్నారు.వీటిలో ఇంకా ఎవరికి కేటాయించని వాటి ని వెంటనే స్థానిక లబ్ది దారులకు ఇచ్చే అంశం పరిశీలించాలని పేర్కొన్నారు. పనుల పురోగతి పై 15 రోజుల్లో ఎంఎల్ఏ ల తో కలిసి ఒక తుది రూపం తేవాలని,అనంతరం మరొక సారి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. సమావేశంలో హౌసింగ్ పిడి ప్రకాష్,పంచాయితీ రాజ్ ఈఈ సురేష్ చంద్ర రెడ్డి,ఆర్అండ్ బి ఈఈ మోహన్,జిహెచ్ఎంసి ఈఈ లు నిత్యానంద,శంకర్,కృష్ణయ్య,ఆర్డిఓ లు పాల్గొన్నారు.