గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన సూపర్ స్టార్ కృష్ణ

432
Super Star krishna

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ. హైదరాబాద్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మనం సైతం కాదంబరి కిరణ్ పాల్గోన్నారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు.

Krishna

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో విక్టరీ వెంకటేశ్ లకు కృష్ణ సవాల్ విసిరారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ ను కృష్ణ అభినందించారు. త్వరలోనే ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం 10కోట్లకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని ,వాటిని సంరక్షణ చెయ్యాలని పిలుపునిచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.