ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం

169
Earthquake

ఢిల్లీ లక్నోలో సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవాళ సాయంత్రం భూమి కంపించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు భూకంప కేంద్రం వెల్లడించింది.

భారత్‌, నేపాల్‌ సరిహద్దుల్లోని భూకంప కేంద్రం ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూకంప కేంద్రం అధికారులు సూచించారు.

earthquake in northern states