ఈ పాదయాత్ర చేపట్టడం అభినందనీయం- మంత్రి

101
Minister Koppula
- Advertisement -

ఈనెల 21న గోదావరి ఖనిలో మొదలై అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు లంగర్ హౌజ్ బాపూఘాట్ వద్ద ముగిసే పాదయాత్ర కరపత్రాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈరోజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని మరింత పెంపొందించాల్సిన అవసరం ఉంది. శాంతి, సామరస్యం,సద్భావన, అహింసల గురించి అవగాహన ఇంకా పెరగాలి అన్నారు. నేషనల్ యూత్ ప్రాజెక్టులో భాగంగా సద్భావన సందేష్ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టడం అభినందనీయం అని మంత్రి పేర్కొన్నారు.

గోదావరి ఖనిలో ఈ నెల 21న మొదలై అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు లంగర్ హౌజ్ వరకు 314 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్న..ఈ పాదయాత్రలో పాల్గొనే 50 యువకులు అభినందనీయులు అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ యూత్ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కె.యాదవరాజు, కన్వీనర్ సుభాష్ చంద్రబోస్,కో-కన్వీనర్ పుట్టా అంజయ్య,కార్యవర్గ సభ్యుడు సంకే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -