సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల..

21
Sai Dharam Tej

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ ఓ స్పోర్ట్స్ బైకు నుంచి పడి తీవ్రగాయాలపాలవడం తెలిసిందే. సాయిధరమ్‌ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్ విడుదల చేశాయి. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు ఆ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తేజ్‌కు వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని వివరించారు. సాయితేజ్ కాలర్ బోన్ విరిగినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. నిన్న అపోలో వైద్యులు సాయితేజ్ కాలర్ బోన్‌కు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.