గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం..

23
Bhupendra Patel

సోమావారం గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ప్రమాణం చేయించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. గుజరాతీ భాషలో భూపేంద్ర పటేల్ ప్రమాణం చేశారు. భూపేంద్ర పటేల్‌ గుజరాత్ 17వ ముఖ్యమంత్రి.