వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిపై మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ..తెలంగాణలో ఎంజీఎం అతిపెద్ద ఆసుపత్రి..మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలి. ఎంజీఎం హాస్పటల్లో సిబ్బంది కొరత ఉంది.హాస్పటల్లో మెరుగైన వసతుల కోసం మరిన్ని నిధులు కేటాయించండి అన్నారు.ఇప్పుడున్న పరికరాలు పూర్తిగా శిలదీలవస్తాకు చేరాయి. అత్యాధునిక పరికరాల కొనుగోలు చేయాలి ఎర్రబెల్లి అన్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వరంగల్ నగరాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.కాళోజి హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తరహాలో కార్పొరేట్ వైద్యం అందించాలన ఉద్దేశ్యంతో ఎంజీఎం ఆస్పత్రిని అత్యాధునికరించలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అత్యధునాతన వసతులతో జైల్‌ని షిఫ్ట్ చేసి హాస్పటల్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు..
త్వరలోనే కావాల్సిన నిధులు కేటాయించి హస్పటల్‌ని ఆధునికరిస్తాం అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందింస్తాం అన్న భరోసా కల్పించాలి. వైద్య రంగంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు ఉండేలా చేస్తాం. ఐదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంది.ప్రతి ఒక్కరు బాధ్యత యుతంగా పని చేసి..వైద్య శాఖ ప్రతిష్టని పెంచాలి. అని అన్నారు.
ఈ సమావేశంలో ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, రమేష్, రాజయ్య, సతీష్‌కుమార్, మేయర్ ప్రకాష్‌రావు, జెడ్పీ ఛైర్మన్ సుధీర్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.