కవ్వాల్ టైగర్‌ రిజర్వ్‌‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి..

450
Minister
- Advertisement -

నిర్మల్ జిల్లా కడెం మండలం కవ్వాల్ అటవీ ప్రాంతం ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద‌ కవ్వాల్ టైగర్‌ రిజర్వ్‌‌ (I LOVE KAWAL TIGER RESERVE)లోగోను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్, దిమ్మదుర్తి రేంజ్‌లో ఫారెస్టు బీట్ ఆఫీసర్స్ కోసం నిర్మించిన క్వార్టర్స్‌ను మంత్రి ప్రారంభించారు.అనంతరం దిమ్మదుర్తిలోని మొక్కల నర్సరిని మంత్రి సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖా నాయక్, పీసీసీఎఫ్‌ శోభా, జడ్పి ఛైర్ పర్సన్ విజయ లక్ష్మి రాంకిషన్ రెడ్డి, కన్సర్వేటివ్ వినోద్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అధికారులు సుధన్, సిద్ధార్థ్ విక్రాంత్, శివాని, చంద్ర శేఖర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -