బీజేపీ నేతలకు ఆ దమ్ము ధైర్యం ఉందా..?- తలసాని

172
minister talasani
- Advertisement -

గ్రేటర్ ఎన్నికలలో నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతు కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరు అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆకుపాములలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తలసాని.. దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

కేవలం 2 ఎన్నికలలో గెలుపుకే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అనేక ఎన్నికలను చూసిందన్న విషయాన్ని మరవొద్దు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేసుకొనేందుకు వినియోగించాలని మంత్రి హితవు పలికారు. పదేపదే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.

- Advertisement -