అడిలైడ్ టెస్టు: భారత్‌ ఓటమిపై కోహ్లీ కామెంట్స్‌

91
Virat Kohli

ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం కారణంగా రెండో ఇన్నింగ్స్‌ను 36 పరుగల వద్ద ముగించింది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ మ్యాచ్ ఫలితంపై నా మనసులో మెదులుతున్న భావాలను వెల్లడించడానికి మాటలు రావడంలేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. 60 పరుగుల ఆధిక్యంలో ఉండి కూడా రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిపోయామని వెల్లడించాడు.

రెండు రోజులు ఎంతో శ్రమించి తిరుగులేని పొజిషన్ లో ఉన్న తాము, కేవలం ఒక గంటలో ఇక గెలవలేని పరిస్థితికి జారిపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. ఇవాళ ఆటలో తాము మరింత తీవ్రత చూపించి ఉంటే బాగుండేదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ బౌలర్లు మొదటి ఇన్నింగ్స్ తరహాలోనే బౌలింగ్ చేసినా, పరుగులు తీయాలన్న ఆలోచనా సరళితో తాము బ్యాటింగ్ చేసి, వికెట్లు అప్పగించామని వివరించాడు.అయితే బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా కుర్రాళ్లు గట్టిగా పుంజుకుంటారని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపాడు.