వలస కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంది..

282
- Advertisement -

రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా జిఎచ్‌ఎంసి పరిధిలో చిక్కుకపోయిన వలస కార్మికులు, పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యం, నగదు అర్హులందరికీ అందేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని నగరంలోని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టేలికన్ఫరెన్స్ నిర్వహించారు.కరోనా ఎక్కువగా ఉన్న కంటెన్మెంట్ ఏరియాలో తిసుకోవాల్సిన చర్యలు, తీసుకుంటున్న జాగ్రత్తలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను,ప్రజలను ఎప్పుటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నిత్యావసరాలకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. రేషన్ కార్డు ఉన్న అందరికి ఈ నెల మొత్తం పంపిణీ జరుగుతుంది. వలస కార్మికులకు కూడా రేషన్‌తో పాటు నగదు కూడా ఇవ్వడం జరుగుతుంది.

మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వలస కూలీలకు అదుకునేల తగిన చర్యలు తీసుకున్నారు. కొన్ని పత్రికలు వలస కార్మికులు తిరిగివెళ్తాం అని అంటున్నారని తప్పుడు వార్తలు రాస్తున్నాయి అది ఎంత వరకు నిజం కాదు. నగరంలో 126 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. నగరంలో 17 జోన్లు గా విభజించి వారికి అధికారులు అందుబాటులో ఉంటున్నారు. కరెంట్,వాటర్ ,పారిశుద్ధ్యము ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజా ప్రతినిధులు ఎప్పుడు ప్రజలతో ఉంటూ వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చుస్తున్నారని మంత్రి తెలిపారు.

ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వలస కార్మికులను అదుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రేషన్ పంపిణీ 90 శాతం పూర్తయింది. గ్రేటర్ లో లక్ష 80 వేల మంది వలస కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నాం. ప్రతి రోజు 95 వేల మందికి అన్నపూర్ణ భోజనం అందిస్తున్నాం. లక్ష 90 వేల మందికి అన్నివిధాలుగా బోజనాలు అందిస్తున్నాం. నగరంలో అన్ని ఏరియాల్లో స్ప్రే చేస్తున్నాం. లాక్ డౌన్ సమయాన్ని వాడుకుని నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని మంత్రి తలసాని పేర్కొన్నారు.

- Advertisement -