నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తుల కోసమేనని మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు తలసాని.
దేశానికి రైతు వెన్నెముక. ప్రస్తుతం రైతులు దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చట్టాలతో రైతుల నడ్డి విరుగుతుందన్నారు. రాజ్యసభలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా చట్టాలను ఆమోదించుకున్నారు. సంఖ్యా బలం ఉందని ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు.
చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం అవుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. తెలంగాణలో పండిన పంట దేశంలో వేరే చోట అమ్ముకోవాలంటే ఎలా. రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్రానికి పట్టదా అని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదు. నిజంగా సమస్య లేకపోతే కేంద్రం ఎందుకు చర్చలు జరుపుతుంది.ఇప్పటికైనా కేంద్రం దిగిరావాలి అని డిమాండ్ చేశారు మంత్రి తలసాని.