సినిమా థియేటర్లు మూసివేతపై స్పష్టత ఇచ్చాయి తెలంగాణ ప్రభుత్వం. థియేటర్లు మూసివేస్తారన్న ప్రచారాన్ని నమ్మెద్దన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. కోవిడ్ నిబంధనలతో థియేటర్లు నడుస్తాయని తెలిపారు.థియేటర్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, విధిగా మాస్కు ధరించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా పక్క పక్క సీట్లతో కూర్చోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే థియేటర్ల మూసివేతపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలపై కరోనా ప్రభావం ఎక్కువ చూపుతుంది. ఇప్పటికే తెలంగాణలో విద్య సంస్థలు బంద్ చేసింది ప్రభుత్వం.