నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం: తలసాని

59
talasani
- Advertisement -

వరద ముంపుకు కారణమైన నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన నాలాల అభివృద్ధి పనులు ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌తో కలిసి పరిశీలించారు.

వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని…వరదలు వచ్చిన సమయంలో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శాశ్వత చర్యల తీసుకుంటామన్నారు. ఇందుకు ఎన్ని కోట్ల నిధులైనా ఖర్చు చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుంచి వచ్చే వరదతోముంపునకు గురవుతున్న నాలా పరిసర కాలనీలు, బస్తీలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎన్‌డీపీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు.

- Advertisement -