దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందేలో భాగంగా ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్‌లో మొక్కలు నాటారు మంత్రి తలసాని.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు, ఎందరో మహనీయుల తాగ్యాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని…సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీజీ అని, ఆయన గురించి విద్యార్థులకు తెలియజెప్పేందుకు గాంధీ చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.