అక్టోబర్ 5న స్వాతిముత్యం!

66
swathimuthyam
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు హీరోగా పరిచయమవుతున్న మూవీ స్వాతిముత్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా బెల్లంకొండ గణేష్‌ హీరోగా లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గణేశ్ జోడీగా వర్ష బొల్లమ్మ కనిపించనుంది. ఈ సినిమా విడుదలకు ముస్తాబై కొంతకాలమవుతోంది. అయితే సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది.

కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘దసరా’ పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయమవున్నారు.

- Advertisement -