మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు:తలసాని

77
- Advertisement -

దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంపేటలోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవం లో పాల్గొని మాట్లాడిన తలసాని… ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రం నిలవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం చెరువులపై మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

రానున్న రోజుల్లో చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని స్పష్టం చేశారు. ఇదతంతా సీఎం కేసీఆర్‌ దూరదృష్టి వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్రం లో గణనీయంగా మత్స్య సంపద పెరుగుతుందని తెలిపారు.

Also Read:Puri:డబుల్ ఇస్మార్ట్ షురూ

- Advertisement -