- Advertisement -
కులగణన ను రీ సర్వే చేయాలి అని డిమాండ్ చేశారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పద్మారావు నగర్ లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పులతడకగా ఉన్నది…. లెక్కలలో స్పష్టత లేదు అన్నారు.
ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి.. 2014 లో KCR ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే లో 62 లక్షల మంది సంఖ్య తగ్గింది అన్నారు.
BC లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికల లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి… SC వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
Also Read:Rishabh Pant:ఇకపై ఆదాయంలో 10 శాతం పేదలకే
- Advertisement -

