ఆన్ లైన్లో సినిమా టికెట్లు రద్దు

377
Minister Talasani Srinivas Yadav
- Advertisement -

సినిమా టికెట్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆన్‌లైన్‌ సినిమా టికెట్లను ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను తలసాని ప్రస్తావించారు. త్వరలోనే సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయానికి స్వస్తి చెప్పనున్నట్లు తెలిపారు.

త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వమే నేరుగా టికెట్లను విక్రయిస్తే అందరికీ లాభముంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త విధానం వల్ల నిర్మాతలకు, పంపిణీదారులకు ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. కుటుంబాలతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే హీరోలవుతారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

- Advertisement -