పంజాగుట్ట‌లో స్టీల్ బ్రీడ్జ్ ను ప్రారంభించిన మంత్రులు త‌ల‌సాని, మహమూద్ అలీ

231
steel bridge
- Advertisement -

పంజాగుట్ట లో స్టీల్ బ్రీడ్జ్ ను ప్రారంభించారు మంత్రులు మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస్ యాదవ్,మేయర్ బొంతు రామ్మోహన్. ఈ కార్య‌క్ర‌మంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,జిఎచెంసి కమిషనర్ లోకేష్ కుమార్,హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ,ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

ఈసంద‌ర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ…లాక్ డౌన్ టైం లో బ్రిడ్జి ని నిర్మించడం అభినందనీయం అన్నారు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ప్రణాళికలు అద్భుతం అన్నారు. ఈసంద‌ర్బంగా మంత్రి కేటీఆర్ ,నగర్ మేయర్ కు ఇతర మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..‌దేశంలో ఎక్కడ లేని విదంగా అద్భుతమైన టెక్నాలజీ వాడుకొని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిఎచెంసి అద్భుతంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి పోవడానికి ఈ బ్రిడ్జి చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.హైదరాబాద్ లో లాక్ డౌన్ పీరియడ్ ని అద్భుతంగా వినియోగించుకొని రోడ్లు ,ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా పూర్తి చేశారు.బ్రిడ్జ్ నిర్మాణనికి కృషి చేసిన జిఎచెంసి, ఇతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

- Advertisement -