దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పాడిరైతులకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన తలసాని…పాడి పరిశ్రమ పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు.
రాష్ర్టంలో 2 లక్షల 13 వేల మంది రైతులకు ప్రయోజనం కల్పించేందుకు పాడి పశువుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో గ్రీన్ ఫీల్డ్ మెగా డైరీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
విజయ డైరీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని…సీఎం కేసీఆర్ ఉదార స్వభావంతో ఒక్కో లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమకు సీఎం కేసీఆర్ అడగకుండానే నిధులు ఇస్తున్నారని తెలిపారు. పాడిరైతుల ప్రోత్సాహకాల కోసం రూ. 248 కోట్ల 3 వేలు విడుదల చేశామని వెల్లడించారు.