తెలంగాణ బ్రాండ్‌తో మాంసం అమ్మకాలు: తలసాని

142
talasani
- Advertisement -

తెలంగాణ బ్రాండ్ పేరుతో మాంసం అమ్మకాలు చేపడతామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుత పరిస్ధితుల్లో మార్కెట్లో మటన్‌ కొనే పరిస్థితులు లేకపోవడంతో త్వరలోనే తెలంగాణ బ్రాండ్ పేరుతో మాంసం అమ్మకాలు చేపడతామన్నారు.

మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో అధికారులు, పశువైద్యుల నూతన సంవత్సర డైరీని, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన తలసాని…తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్షీర, నీలి, గులాబీ విప్లవాలు తీసుకొచ్చామని తెలిపారు. అపారమైన సంపదను సృష్టించి పేదలకు పంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని..దీంట్లో భాగంగానే త్వరలో తెలంగాణ బ్రాండ్ తో మాంసం విక్రయాలు ప్రారంభించనున్నామని తెలిపారు.

గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీతో పెద్ద ఎత్తున గొర్రెలు, మత్స్య సంపద పెరిగిందని దీంతో మాంసం ఉత్పత్తులు కూడా భారీగా పెరిగాయని వెల్లడించారు.మార్కెట్లలో మటన్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని దీంతో సామాన్యులకు మటన్ అందుబాటు ధరలో లేదని..తెలంగాణ బ్రాండ్ తో త్వరంలో మటన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

- Advertisement -