క్రీడా హబ్‌గా తెలంగాణ: శ్రీనివాస్ గౌడ్‌

187
srinivas goud
- Advertisement -

దేశంలోనే క్రీడా హబ్‌గా తెలంగాణ మారనుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో క్రీడల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్…క్రీడా పాలసీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం వేశారని, త్వరలోనే మంచి క్రీడా పాలసీని తయారు చేస్తామని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రామీణ క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో మారుమూల గ్రామల నుంచి పట్టణాల వరకు ప్రతిస్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారుల తయారు చేస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఉన్న క్రీడా మైదానం అభివృద్ధిపై ఈ సమీక్షలో చర్చించారు. స్టేడియం అభివృద్ధకి అవసరమైన డిజైన్లను తయారు చేయాలని మంత్రి కన్సల్టెంట్‌లను కోరారు.

క్రీడలను ప్రోత్సహించే దిశలో తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో గ్రామీణ క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

- Advertisement -