సీఎం కేసీఆర్ బర్త్ డే..అనాథలకు పండ్లు పంపిణీ

61
srinivas goud
- Advertisement -

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలోని అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు, దుప్పట్లు, స్కూల్‌ బ్యాగులు, కార్మికులకు హైజనిక్‌ కిట్లను పంపిణీ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

సీఎం బర్త్ డే సందర్భంగా మూడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింలు, వైస్ చైర్మన్ తాటి గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -