సంపత్ నందితో బాలయ్య బాబు..!

42
sampath
- Advertisement -

అఖండతో రికార్డులను తిరగరాశాడు నందమూరి బాలకృష్ణ. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు బాలయ్య. ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్న బాలయ్య దీని తర్వాత అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారని టాక్. బాలయ్యతో ఆ కథను చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నిర్మాత రవీందర్ రెడ్డికి వినిపించగా ఆయన తెగ ఇంప్రెస్ అయ్యారట. దీనికి బాలయ్య కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా బాలయ్యతో సినిమా చేసే బంపర్ ఛాన్స్ కొట్టేశారు సంపత్ నంది.

‘రచ్చ’ .. ‘బెంగాల్ టైగర్’ వంటి మాస్ యాక్షన్ హిట్లతో సంపత్ నంది మంచి జోష్ మీదున్నాడు.

- Advertisement -