అంతర్జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తోన్న స్థలానికి భూమిపూజ జరిగింది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్ దంపతులు, గోపిచంద్ దంపతులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూమిపూజలో పాల్గొన్నారు. కొటక్ మహేంద్ర బ్యాంక్ , గోపిచంద్ అకాడమీ సంయుక్తంగా ఈ నిర్మాణం చేపడుతోంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక అకాడమీ స్థాపించారు గోపిచంద్.తనలాంటి అనేక మంది గోపిచంద్ లను తయారు చేయాలని భావించారు.వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చేరుతున్నారు.సీఎం కేసీఆర్ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.గ్రామీణ క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలని మంత్రి అన్నారు.
బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ బ్యాట్మింటన్ వేదిక అందుబాటులోకి వస్తే..క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ తీసుకునే అవకాశముంటుందని..వీటి నిర్మాణంతో 6ఏసీ కోర్టులు, అథ్లెటిక్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ లు అందుబాటులోకి వస్తాయని అన్నారు.