హీరోయిన్‌ అనుష్కకు గాయాలు..!

210
- Advertisement -

టాలీవుడ్‌లో ఇప్పటికే పలు ప్రమాదాలు జరుగగా పలువురు యంగ్ హీరోలు గాయాల బారిన పడ్డారు. వరుస ప్రమాదాలతో టాలీవుడ్ షాక్ అవ్వగా తాజాగా మరో ప్రమాదం జరిగింది . హీరోయిన్ అనుష్క సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్‌లో గాయపడింది. కాలుకి గాయం కావడంతో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని సలహా ఇచ్చారట డాక్టర్లు.

Anushka Shetty

అయితే ఈ విషయాన్ని మీడియాకు చెప్పడానికి అనుష్క ఒప్పుకోలేదట. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోపక్క అనుష్క ‘సైలెన్స్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా భారీ తారాగణంతో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా వంటి స్టార్లు నటించారు.

- Advertisement -