- Advertisement -
జమ్మూకాశ్మీర్ లోని లడక్ లో కొండచరియలు విరిగి మరణించిన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వని కుంట తండాకు చెందిన ఆర్మీజవాన్ పరశురాం యొక్క అంత్యక్రియల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఆదివారం పరశురాం అంత్యక్రియలు అతడి స్వస్థలంలో నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.
గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ అంత్యక్రియలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. జవాను కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాను పరశురాం కుమారుడ్ని ఎత్తుకుని వారికి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పరశురాం కుమార్తె తండ్రి భౌతికకాయం ఎదుట సెల్యూట్ చేయడం ఆ చిన్నారి స్ఫూర్తికి అద్దం పట్టింది.
- Advertisement -