తైక్వాండో క్రీడాకారులను అభినందించిన మంత్రి..

107
Minister Srinivas Goud

నవంబర్ 23,24 వ తేదీలలో ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నగరంలో జార్జ్ హెచ్‌ కార్నెల్ స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన బ్రిటిష్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్ షిప్- 2019లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 మంది క్రీడాకారుల బృందం మూడు విభాగాలైన పాటన్, స్పారింగ్, స్పీడ్ కిక్కుకింగ్ ఈవెంట్‌లలో అద్భుత ప్రతిభ కనబరచి 17 పథకాలు సాధించిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులను అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రీడలను, క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి, తైక్వాండో కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు.