గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు..

77

మహబూబ్‌నగర్‌లోని బాలానగర్ మండలం రాళ్లగడ్డతండాలో గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సహాయ కార్యదర్శి వాల్యానాయక్,తదితరులు పాల్గొన్నారు. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ జిల్లా కేంద్రంలో గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. డోర్నకల్‌లో గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు ఎమ్మెల్యే రెడ్య నాయక్.

mlas

నల్లగొండ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని జర్నలిస్టు మరి ఉద్యోగుల వెల్నెస్ ఆసుపత్రి ముందు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన యూనియన్ నాయకులు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటి సెల్ఫీ తీసుకున్నారు.

MLA DS Redya Naik