31 లోపు పదోన్నతులు పూర్తి చేసేలా కృషి :శ్రీనివాస్ గౌడ్

42
srinivas goud

31వ తేదీలోపు పదోన్నతులు పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం అని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మొదటి పీఆర్సీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు…అందరికీ పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని చెప్పారు శ్రీనివాస్ గౌడ్.

కరోనా వల్ల పిఆర్సీ కొంత ఆలస్యమైంది.. ప్రభుత్వాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అధికారిక అన్యాయం జరిగినా అండగా నిలుస్తున్నాం…పీఆర్సీ ఇచ్చిన నివేదికను చూసి ఆందోళన చెందకూడదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు సరైన న్యాయం చేస్తారు…సీపీఎస్ ను జాతీయ స్థాయిలో తీసుకుచ్చారన్నారు. సీపీఎస్ ఉద్యోగుల్లో కొంత ఆందోళన ఉంది…ఉద్యోగులను సంతృప్తి చెందేలా సంప్రదింపులు జరిపిన తరువాత పీఆర్సీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

ఉద్యోగులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులు ఏ ఉన్నత స్థాయిలో ఉన్న కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. 20 మంది కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తెలంగాణ శభాష్ అన్నారు. రాష్ట్రానికి అనేక అవార్డులు వస్తున్నాయంటే ఉద్యోగుల శ్రమ ఉంది….ఇతర రాష్ట్రాల మాదిరిగా అధికారులందరికీ పదోన్నతులు కల్పిస్తాం అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ విదంగా పదోన్నతులు ఇస్తున్నాయో అధ్యయనం చేసి అవకాశం కల్పిస్తాం..ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మనిషి మన ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచిస్తారు మీరు అధైర్యపడవద్దన్నారు.

ఎన్ని సంఘాలు ఉన్న … ఉద్యోగుల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మమత. మన డిమాండ్స్ అతి త్వరలో నెరవేరుతాయి…తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మన వంతు కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత వరకు పీఆర్సీ రేకమెండేషన్ ఏదీ ఉన్న పెంచుతారు తప్పా తగ్గించరన్నారు.