ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన సీఎం, అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ & ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌తో పాటు FSSAI స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
తిరుమల పిండిమర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మించారు. ఈ ల్యాబ్‌లో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతపై సమగ్ర పరీక్షలు నిర్వహించనున్నారు.
సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండు అంతస్తుల్లో ఈ ఆధునిక ల్యాబ్‌ను నిర్మించారు. రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 50 రకాల ఆధునిక యంత్రాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Also Read:Shreyas:ఈసారి ట్రోఫీ మాదే!
ప్రత్యేకంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అందించే శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎటువంటి సందేహాలు లేకుండా ఉండేందుకు ఈ ల్యాబ్ కీలకంగా ఉపయోగపడనుంది. ప్రసాదాల్లో కల్తీకి తావులేకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

