- Advertisement -
కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలను ఆదుకుంది తెరాస ప్రభుత్వం అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది. అనునిత్యం ప్రజలకు అందుబాటులో వుండే నాయకులను ఎన్నుకోవాలన్నారు. రైతును రాజుని చేయాలనే లక్ష్యం కేసీఆర్ ది. రైతు చనిపోతే రైతుకు భీమా సదుపాయం కల్పించిన ఘనత కేసీఆర్ ది అని మంత్రి తెలిపారు. ఎలక్షన్ ఏదైనా గెలుపు మాత్రం తెరాస దే. ప్రతి గ్రామంలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటును నమోదు చేసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
- Advertisement -