పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి..

218
Minister satyavathi rathod
- Advertisement -

రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో సఖీ కేంద్రానికి 49 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే భవనానికి ఈరోజు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. అలాగే 27.5 లక్షల రూపాయలతో గిరిజన మహిళల ఆధ్వర్యంలో నిర్వహించే గిరి బ్రాండ్ శానిటరీ నాప్కిన్స్ యూనిట్ భవనాన్ని మంత్రి ప్రారంభించడం జరిగింది. అనంతరం గోవింద‌రావుపేట మండ‌లం చ‌ల్వాయిలో రూ. 22 ల‌క్ష‌ల‌తో నిర్మించిన రైతు వేదిక భ‌వ‌నాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని ప్ర‌తి ఎక‌రాకు గోదావ‌రి నీళ్లు అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వ్య‌వ‌సాయాన్ని పండుగ చేసి, రైతును రాజు చేసే ల‌క్ష్యంలో భాగంగా ఈ రైతు వేదిక‌ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. రైతు వేదిక‌లు రైతుల సంక్షేమానికి చిహ్నాలు అని చెప్పారు. జిల్లాలోని పాలెం వాగు నిర్మానానికి రూ. 5 కోట్లు కేటాయించాం.. ఈ వాగు ద్వారా 5 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తామ‌న్నారు. మొండి కుంట వాగు ద్వారా కూడా నీరు వ‌స్తుంద‌ని తెలిపారు. భవిష్యత్‌లో ములుగు జిల్లా రైతు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ హామీ ఇచ్చారు.

- Advertisement -