యూకే కొత్త స్ట్రెయిన్ భయంకరమైనది కాదు- ఈటెల

135
Minister Etela
- Advertisement -

కొత్త రకం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. యూకేలో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్ మళ్లీ అలజడి రేపుతోంది. ఈ క్రమంలోనే యూకేతో ప్రపంచ దేశాలు సంబంధాలు తెరచుకున్నాయి. విమాన సర్వీసులను నిలిపివేశాయి. అయితే ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోనూ ఈ కొత్త వైరస్ కలకలం రేపుతోంది.

యూకే కరోనా కొత్త స్ట్రెయిన్ భయంకరమైనది కాదు. దీనికి ఎక్కువ చంపే శక్తి లేదు, ఎక్కువ మందికి వ్యాప్తి చెందిస్తుంది అని నిపుణులు చెప్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్‌పై మంత్రి ఈటెల మీడియా సమావేశంలో మాట్లాడారు. దీనికి ప్రస్తుతం పాత పద్దతిలోనే చికిత్స అందిస్తున్నామని..10 నెలలుగా ప్రజలు భయంతో ఉన్నారు. ఇంకా ప్రచార మాధ్యమాలు ప్రజలను భయపెట్టవద్దని మంత్రి కోరారు. కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అని మంత్రి ఈటెల ప్రజలకు సూచించారు.

బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లలో ఇప్పటికే చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్లకు సోకింది కొత్త రకం కరోనానా.. పాతదేనా అన్నది ఇంకా తేలలేదు. అయితే, ముందు జాగ్రత చర్యగా వాళ్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్త కరోనా సోకిన వాళ్ల కోసం 12 ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ఐదు జిల్లాల్లోని 12 ఆసుపత్రుల్లో ఈ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులుంటాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -