గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సత్యవతి

511
sathyavathi rathod
- Advertisement -

స్త్రీ శిశు సంక్షేమానికి, గిరిజనుల అభివృద్ధిని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి పలు అభివృద్ధి,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రాల్గొన్నారు.

నియోజకవర్గానికి వచ్చిన మంత్రికి హాజీపూర్ వద్ద గిరిజన మహిళలు ఘనంగా స్వాగతం పలికారు, గిరిజన వేషధారణలో గిరిజన మహిళలతో కలిసి మంత్రి నృత్యం చేశారు అనంతరం. మద్దిమడుగులోని పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని. ప్రత్యేక పూజలు చేశారు,అనంతరం. మన్ననూరులో నూతనంగా నిర్మించిన గిరిజన కళ్యాణ మంటపాన్ని మంత్రి ప్రారంభించారు.

ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఆశ్రమ పాఠశాలను మంత్రి తనిఖీ చేసి విధ్యార్తులతో ముచ్చటించారు,ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో మొక్కలు నాటి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.అనంతరం ఐటిడిఎ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Telangana Minister sathyavathi rathod speech at Achampet..Telangana Minister sathyavathi rathod speech at Achampet..

- Advertisement -