బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి సత్యవతి..

167
sathyavathi rathod
- Advertisement -

రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ జన్మదినోత్సవం సందర్భంగా నేడు మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం దగ్గర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం, శనిగాపురం లోని అంగన్ వాడి కేంద్రంలో మొక్కలు నాటారు. అనంతరం గురుకుల కాలేజీలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సిబ్బందితో ఆనందం పంచుకున్నారు.

అనంతరం మీడియాతో మంత్రి సత్యవతి రాథోడ్…తెలంగాణను హరిత తెలంగాణ గా మార్చే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లక్ష్యంలో భాగంగా ప్రియతమ ఎంపీ సంతోష్ అన్న చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో నేడు నా పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ గిరిజన గురుకుల కాలేజీలో మొక్కలు నాటి మిగతా వారందరూ కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కావాలని కోరుతున్నామన్నారు.

మా శాఖల లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య, ఎస్సీ ఎస్టీ గురుకులాల కార్యదర్శి శ్రీ ప్రవీణ్ కుమార్ గారికి గ్రీన్ చాలెంజ్ విసురుతున్నా ను. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో గురుకుల విద్యాలయాల్లోని సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఒక్కొక్క మొక్కను నాటి ముఖ్యమంత్రి గారి హరిత తెలంగాణ ఆశయం లో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

గడిచిన కొద్ది సంవత్సరాల్లోనే హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరగడం వల్ల ఎంత మేలు జరుగుతుందనేది మనం చూస్తున్నాం అన్నారు.గ్రీన్ ఛాలెంజ్ కొనసాగించాలని ముగ్గురు కార్యదర్శులు గురుకులాల్లోని ఆశ్రమ పాఠశాలల్లోని సిబ్బంది గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి, మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నాను.మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన శాఖలో కొన్ని గురుకుల విద్యాలయాలు ఇప్పటికీ కిరాయి భవనాలను కొనసాగుతున్నాయి. త్వరలో వాటికి పక్కా భవనాలు వచ్చే విధంగా, సరైన మౌలిక వసతులు లేని చోట సమగ్ర మౌలిక వసతులు కల్పించే విధంగా నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.నేడు నేను మొక్కలు నాటిన ఈ గిరిజన గురుకుల కాలేజీలో డైనింగ్ హాల్ లేదని చెప్పారు.

త్వరలోనే డైనింగ్ హాల్ మంజూరు చేసి, గిరిజన గురుకుల కాలేజీని ఒక హరిత విద్యాలయంగా రూపొందించేందుకు, జిల్లాలో ఈ విద్యాలయంని ఒక రోల్ మోడల్ గా అభివృద్ధి చేసేందుకు నేను ప్రయత్నిస్తాను.కోవిడ్-19 వల్ల మా పాఠశాలలన్నీ పిల్లలు లేక బోసిపోయాయి. కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామిని మా విద్యార్థులంతా వీలైనంత త్వరగా ఈ పాఠశాలల్లో చేరి ఆనందంగా, సందడిగా ఉండాలని కోరుకుంటున్నాను. పాఠశాలలు ప్రారంభించక పోవడం వల్ల గిరిజన విద్యార్థులు పేదరికం వల్ల ఇళ్లల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వారు పాఠశాలలకు వచ్చే విధంగా ఆశీర్వదించాలని ఆ స్వామివారిని నా పుట్టినరోజు సందర్భంగా వేడుకుంటున్నానని వెల్లడించారు.

- Advertisement -