- Advertisement -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీని ఆదరించి, అభిమానించి ఓటేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఙతలు అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు అందరికీ మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు, బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. 51 డివిజన్లలో పోటీ చేసిన ఎంఐఎం 44 చోట్ల విజయకేతనం ఎగురువేసింది. అయితే ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎక్కేదెవరు అనేదానిపై సందిగ్ధత నెలకొంది.
- Advertisement -