సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలుః సబితా ఇంద్రారెడ్డి

588
cm kcr Sabitha indra Reddy
- Advertisement -

తనను నమ్మి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేస్తానన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని నిలబెడుతానని చెప్పారు.

తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలిన అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు నా వంతు సహాకారం అందిస్తానని తెలిపారు. గత 5 సంవత్సరాల నుండి ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూసేలా ఆదర్శము గా నిలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్ న్యాయకత్వములో స్వపరిపాలన సుపరిపాలన అన్న దిశగా నడుస్తున్న ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వం లో పని చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -