రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది..

203
puvvada ajay
- Advertisement -

శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా పోడియం ముత్యాలమ్మ, వైస్ చైర్మన్ కొమరం రాంబాబుతో పాటు 12 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి తెలంగాణను సస్యశ్యామలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ప్రభుత్వానికి నష్టమొచ్చినా రైతుకు లబ్ధి చేకూరాలని వందశాతం పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు ఈ సారి గత యాభైఏళ్లలో ఎన్నడూ లేనంత రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదై పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం అంచనా వేసి రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి పంపిస్తే నయాపైసా సాయం చేయలేదని మంత్రి అజయ్‌కుమార్‌ మండిపడ్డారు.

- Advertisement -