మంత్రి పువ్వాడకు రెండోసారి కరోనా…

115
puvvada ajay
- Advertisement -

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు,సెలబ్రెటీలు కరోనా బారిన పడగా తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు రెండోసారి కరోనాగా తేలింది.

ఫస్ట్ వేవ్ లోనూ కరోనా బారిన పడిన పువ్వాడ…సెకండ్ వేవ్‌లోనూ ఈ మహమ్మారి బారిన పడ్డారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని,ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు అజ‌య్ వెల్ల‌డించారు. తాను ఆరోగ్యంగా ఉన్నాన‌ని, ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని మంత్రి పువ్వాడ విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -