డిసెంబర్ 2న ఖమ్మం ఐటీ హబ్‌ ప్రారంభం: మంత్రి పువ్వాడ

210
puvvada
- Advertisement -

డిసెంబర్ 2న మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌. ఖమ్మంలో ఐటీ హబ్, దంసలాపురం ఆర్.ఓ.బీ , పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. కేటీఆర్‌తో పాటు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారని చెప్పారు.

ఖానాపురం ట్యాంక్ బండ్ , బల్లేపల్లిలో ఆధునిక వైకుంఠదామం , ఖబర్దాస్తాన్ ప్రారంభం జరుగుతుందన్నారు.ఎన్.ఎస్పీ కాలువ పై వాక్ వే, బ్యూటీఫికేషన్ చేస్తున్నాం, గ్రీనరీ డెవలప్ మెంట్ చేస్తం సుడా నిధులతో రోడ్ , సెంట్రల్ లైటింగు , రఘునాథపాలెం ట్యాంకు బండ్ ను మంత్రి కేటీఆర్ ప్రజలకు అంకితం చేస్తారని వెల్లడించారు.

దంసలాపురం ఆర్.ఓ.బీ కి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టుకున్నాం , ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తం ..మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాం అన్నారు పువ్వాడ.

ఐటీ హబ్ ను అధ్బుతంగా తీర్చిదిద్దాం…కేసీఆర్రు , కేటీఆర్ ప్రోత్సాహం తో ఖమ్మం ను అధ్బుతంగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు.డిసెంబరు చివరి నాటికి ఖమ్మం లో 75 వేల ఇండ్ల కు ఇంటింటికీ నళ్లా పెట్టి రోజూ నీళ్లు ఇస్తం ..కొత్త సంవత్సరం కానుక గా జిల్లా ప్రజలకు బస్టాండ్ అందుబాటులోకి తీసుకొస్తం అన్నారు.

- Advertisement -