బాల‌య్య‌ తో జంటగా అంజలి ??

117
nbk108
- Advertisement -

అనిల్ రావిపుడి,బాల‌య్య‌ కాంబినేషన్లో రాబోతున్న ఫుల్ యాక్ష‌న్‌ చిత్రం#NBK108 . ఈచిత్రం తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో బాల‌య్య‌ కూతురు పాత్ర‌లో శ్రీలీలా న‌టిస్తున్నారు. కాగా బాల‌య్య‌కు జోడీగా ఎవ‌ర‌నేది ఇప్ప‌టివ‌ర‌కు ఒక క్లారిటీ లేదు. అయితే హీరోయిన్ అంజలి బాల‌య్య‌కు జంటగా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్నాయి. అందులోను ఈ చిత్రంలో అంజలిది చాలా ముఖ్యమైన పాత్ర అని స‌మాచారం. కాగా అంజలిది హీరోయిన్ రోల్ కాదు,విలన్ రోల్ అని, హీరోయిన్ రోల్ కోసం ఇంకా అన్వేష‌ణ జ‌రుగుతుంద‌ని కుడా వార్త‌. చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే క్యారెక్టర్ కు త‌గిన కథానాయికను ఫైన‌ల్ చేసి అధికారికంగా తెలపనున్నారు.

షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్టనుంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

బాల‌య్య‌ ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్‌ సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ని సమాచారం.

- Advertisement -