కరోనా సమయంలోనూ కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు మ్యాక్సీ క్యాబ్స్, మినీ వ్యాన్స్, ఆటో డ్రైవర్ల. ఈ నేపథ్యంలో వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా వాక్సినేషన్ ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ లోని జాన్సన్ గ్రామర్ స్కూల్ నందు వాక్సినేషన్ కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సూపర్ స్ప్రెడర్స్ (Super spreders)కు వ్యాక్సినేషన్ (Vaccination)లో భాగంగా ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు (Auto, cab drivers) టీకాలు ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నిత్యం వందలాది మందితో కలుస్తుండటం కారణంగా.. వైరస్ వ్యాప్తి కారకులు కాకూడదనే ఉద్దేశ్యంతో వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించడమైందన్నారు. విజయవంతంగా ఆయా టికాలను సూపర్ స్ప్రెడ్ ర్స్ పొందుతున్నారని అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.
జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 10 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయడమైందన్నారు. ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ పొందాలనుకునే వారు, ఇప్పటి వరకు పొందని డ్రైవర్లు తక్షణమే రవాణా శాఖ వెబ్సైట్ (Transport department)లో నమోదు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో 3 లక్షల పైచిలుకు ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. ఇందులో 2 లక్షల 25 వేల మంది ఆటోడ్రైవర్లు, లక్షా 10 వేల మంది క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుండగా అందరికి టీకాలను ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.