- Advertisement -
రాజకీయంగా తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్. వైరాలో కమ్మ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాయి గణేష్ ఆత్మహత్యపై స్పందించారు.
జరిగింది చిన్నవిషయమే అయినా.. దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు నాపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మంతి వర్గం నుంచి తనను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పువ్వాడను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా హైకోర్టు సాయి గణేష్ ఆత్మహత్యపై వివరణ ఇవ్వాలని మంత్రి పువ్వాడతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసింది.
- Advertisement -