డా. బీఆర్‌ అంబేద్కర్‌కు మంత్రి వేముల ఘన నివాళి..

269
minister vemula
- Advertisement -

భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికారిక నివాసంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.పూలమాలవేసి పీడిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

భారత రత్న,రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 129 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం,పీడిత ప్రజల బాగు కోసం,బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం డా.బి.ఆర్ అంబేద్కర్ చూపించిన చూపించిన బాటలో వారిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు అదే బాటలో సాగుతున్నారన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే మనమందరం కూడా నడిచి పేదవారి ఆకలి తీర్చడం కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే వారికి నిజమైన నివాళి అన్నారు. భారతదేశంలో 90శాతం ఉన్న బడుగుబలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే,డా.బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి నిజమైన గౌరవం ఇచ్చిన వారమవుతామని ఆయన తెలిపారు.

- Advertisement -